మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనుకుంటారు.. కాలం మారింది. మగవాళ్ళ పై ఆధారపడకుండా సొంత వ్యాపారాలు చేస్తుంటారు. అలాంటి వారికి బ్యాంకులు కూడా రుణాలను అందిస్తున్నారు. మహిళల అభివృద్ధికి సాయపడుతున్నారు. మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మహిళా ఉద్యమి నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు తక్కువ వడ్డీకి ఆర్థిక సహాయం అందించడం, అలాగే వారికి అధికారం ఇవ్వడం జరుగుతుంది. మహిళలను పారిశ్రామిక రంగంలో మరో మెట్టు పెంచేలా పథకాన్ని అభివృద్ది చేస్తుంది.