గోల్డ్ బ్యాంక్ లలో పెట్టీ లోన్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం అతి తక్కువకు వడ్డీని ఇస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ గోల్డ్ రుణాల పై అతి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తుంది.గోల్డ్ లోన్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. కేవలం 7.5 శాతం వడ్డీకే గోల్డ్ లోన్ అందించాలని నిర్ణయించింది. అంతేకాక, యోనో యాప్‌తో గోల్డ్‌లోన్‌కు దరఖాస్తు చేసే వారికి ప్రాసెసింగ్ ఫీజుపై పూర్తి మినహాయింపు ఇచ్చింది. బంగారు ఆభరణాలు, నాణేలను తాకట్టు పెట్టడం ద్వారా ఈ రుణాలను పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది.