లక్ష మంది బ్యాంకు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్‌ను స్పాన్సర్ చేస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులకు కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసుల వ్యయాన్ని రీఎంబర్స్ చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. తమ బ్యాంకులు, బ్రాంచ్ కార్యాలయాల్లో ఉద్యోగులు, కస్టమర్లకు సురక్షిత వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తామని, ఉద్యోగులు వారిపై ఆధారపడిన వారి వ్యాక్సినేషన్ వ్యయాన్ని భరిస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది.