కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్రం పైకి పన్ను రేట్లు తగ్గించామని పన్ను రేట్లు తగ్గించడం వలన ఉద్యోగులకు ఊరట కలుగుతోందని చెబుతున్నా పరోక్షంగా మాత్రం ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. బడ్జెట్ 2020 ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ సహా సూపరాన్యుటేషన్ ఫండ్స్ కు ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీల కంట్రిబ్యూషన్ 7.5 లక్షల రూపాయలు దాటితే ఉద్యోగులపై పన్నుభారం పడనుందని చెప్పారు. 

బేసిక్ శాలరీ ఎక్కువగా తీసుకుంటున్న వారిపై కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ ప్రతిపాదనలతో నేరుగానే భారం పడనుంది. తాజా బడ్జెట్ ప్రతిపాదనల వలన భారీగా ఆదాయం కలిగిన వారికి కూడా సమస్యలు తప్పటం లేదు. పలు ఇన్వెస్ట్‌మెంట్ సాధానాల్లో ఉద్యోగులు పన్ను మినహాయింపులను పొందటం కోసం డబ్బులు దాచుకుంటూ ఉంటారు. వీరిపై కేంద్ర బడ్జెట్ తాజా ప్రతిపాదనల భారం పడనుంది. ఈ కొత్త రూల్ గురించి కంపెనీ రిటైర్మెంట్ ఫండ్, పీఎఫ్, ఎన్‌పీఎస్ లాంటి పన్ను మినహాయింపు సాధనాల్లో డిపాజిట్ చేసేవారు తప్పకుండా తెలుసుకోవాలి. 
 
ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఉద్యోగులకు బదులు కంపెనీలు చేసే కంట్రిబ్యూషన్ పై ఎటువంటి పరిమితులు లేవు. కానీ కంపెనీలు చేసే కంట్రిబ్యూషన్ పై పరిమితులు పెట్టి ఉద్యోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఉద్యోగి పీఎఫ్ కు కంపెనీ కంట్రిబ్యూషన్ ఉద్యోగి వేతనం కంటే 12 శాతం మించితే అప్పుడు పన్ను భారం పడనుంది. అదే విధంగా కంపెనీ రిటైర్మెంట్ ఫండ్ కు ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ లక్షన్నర రూపాయలు దాటినా అప్పుడు కూడా పన్ను భారం పడనుంది. 2020 ఏప్రిల్ 1 నుండి ఈ నిబంధన అమలులోకి రానుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: