ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదు. కరోనా వల్ల వ్యాపారాలు బంద్ కావడంతో ప్రజలు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నారు. కరోనా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
కస్టమర్ల కొరకు కోవిడ్ 19 లోన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్యాంక్ నుంచి రిటైల్ కస్టమర్లు ఎవరైనా రుణాలను పొందవచ్చు. ఈ తరహా రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు 25,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు పర్సనల్ రుణాలను మంజూరు చేస్తోంది. సాధారణ వడ్డీ రేటుతో పోలిస్తే తక్కువ వడ్డీకే ఈ రుణాలు మంజూరు చేస్తున్నట్లు సమాచారం. 
 
బ్యాంక్ ఆఫ్ బరోడా సెప్టెంబర్ నెల 30 వరకు ఈ తరహా రుణాలను మంజూరు చేయనుంది. సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువ ఉన్నవాళ్లకు మాత్రమే బ్యాంక్ రుణం మంజూరు చేస్తుంది. తీసుకున్న రుణాన్ని 5 సంవత్సరాలలోగా తిరిగి చెల్లించాలి. కనీసం 25,000 రూపాయల రుణం తీసుకోవాలి. ఎటువంటి ప్రీపేమెంట్ చార్జీలు ఉండవు. 500 రూపాయల ప్రాసెసింగ్ ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: