కరోనా పుణ్యమా అంటూ ఆర్ధిక ఇబ్బందులు వద్దనుకున్నా వస్తూనే ఉన్నాయి.. అయితే ఈ ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడటానికి ఇంట్లోని గోల్డ్ ను తాకట్టు పెడుతుంటారు.. కొన్ని బ్యాంకులు లోన్ కోసం ఇచ్చిన అసలు కన్నా కూడా వడ్డీ ఎక్కువ వేస్తూ జనాలకు  మరింత భారంగా తయారవుతారు. అలాంటి వారు ముందుగా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంకులను తెలుసుకొని లోన్ పెట్టడం మంచిదని అంటున్నారు. ఆ బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం..



ఇటీవల కాలంలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఎక్కువ మంది బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇలా అవసరానికి డబ్బులు తెచ్చుకొని ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంటారు. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ పడుతోందో తెలుసుకోవాలి. ఆ బ్యాంకులు వెళ్లి బంగారంపై రుణం తెచ్చుకోవాలి. దీంతో రుణ గ్రహీతలు ఎక్కువగా నష్టపోరు. అయితే ఒక్కో బ్యాంక్ ఒక్కో రకమైన వడ్డీ రేటుతో గోల్డ్ లోన్స్ అందిస్తూ ఉంటాయి. అలాంటి బ్యాంకులో ముందుగా వినిపించే బ్యాంక్ పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్ అందిస్తోంది. ఈ బ్యాంకులో బంగారు రుణాలపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. రూ.5 లక్షల వరకు రుణ మొత్తానికి ఇది వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 7.35 శాతం వడ్డీకే బంగారు రుణాలు అందిస్తున్నారు.



భారత దేశంలో అతి పెద్ద వాణిజ్య బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బంగారు రుణాలపై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమౌతోంది. అదే మీరు గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో బంగారం పెడితే ఎక్కువ వడ్డీ కట్టాలి. ఐఐఎఫ్‌ఎల్‌లో గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 9.24 శాతంగా ఉంది. ఇకపోతే బజాజ్ ఫైనాన్స్ లో ఫిన్‌సర్వ్‌లో అయితే 11 శాతం, ముత్తూట్ ఫైనాన్స్‌లో 11.9 శాతం, మణపురం ఫైనాన్స్‌లో 12 శాతం చొప్పున వడ్డీ పడుతుంది.. అన్నిటికన్నా బెస్ట్ ఎస్బిఐ లో వడ్డీ తక్కువ రుణాలు ఎక్కువ అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: