ఆంధ్రప్రదేశ్లోని రైతులకు కూటమి ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ అందించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు సహాయాన్ని విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 13వ తేదీన రైతులకు ఖాతాలో నేరుగా రూ.6000 రూపాయలను జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏపీ ప్రభుత్వం ఈ డబ్బులను జమ చేయబోతోంది. పిఎం కిసాన్ కింద రూ .2000వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రూ.4000 రూపాయలు మొత్తం కలిపిరూ .6000 ఈనెల 13వ తేదీన జమ చేయబోతున్నారు.



అస్సాంలో గౌహతీలో జరిగేటువంటి కార్యక్రమంలో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రతి ఏడాది కూడా రూ .20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించనుంది. ఇందులో ఏపీ ప్రభుత్వం రూ .14 వేల రూపాయలు పీఎం కిసాన్ కింద కేంద్రం రూ .6000 అందించనుంది. మొత్తం ఏపీ రైతులకు 20వేల రూపాయలు  అందనుంది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఈ డబ్బులు ఉపయోగపడే విధంగా ఇవ్వబోతోంది. ఫిబ్రవరి నెలలోనే ఈ డబ్బులను ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆలస్యం అయ్యింది.



కుటుంబంలో ఇద్దరి వ్యక్తి పేర్ల పైన ఒకే పొలం ఉంటే మాత్రం ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వనున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులకు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఒకవేళ ఎవరైనా ఈ పథకం కింద లబ్ధి పొందాలి అంటే చిన్న, సన్న కారు రైతు అయి ఉండాలి, ఎక్కువ పొలం ఉన్నా కూడా ఈ పథకం వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు ఎవరు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. అర్హులయ్యుండి ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోలేదు దగ్గరలో ఉండే గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: