నిన్న రాత్రి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఉద్దేశించి ఒక అభిమాని ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశాడు. అందులో పరోక్షంగా మహేష్ బాబు (బాబ్) రికార్డులను తుడిచేయాలనే అర్థం వచ్చేలా కామెంట్ ఉంది. సినిమా రిలీజ్ టెన్షన్‌లో ఉన్న హరీష్ శంకర్, ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే, ఏదో పాజిటివ్ కామెంట్ అనుకుని ‘తధాస్తు’ అని రిప్లై ఇచ్చి రీ-ట్వీట్ చేశారు. తప్పు జరిగిందని సెకన్ల వ్యవధిలోనే గుర్తించి హరీష్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినా, అప్పటికే యాంటీ ఫ్యాన్స్ దానిని స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేసేశారు. ఇంకేముంది.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హరీష్ శంకర్‌ను నిలదీస్తూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున హంగామా మొదలైంది.
పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన హరీష్ శంకర్ వెంటనే రంగంలోకి దిగారు. తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని వివరిస్తూ ఒక ఎమోషనల్ అండ్ లాజికల్ మెసేజ్ పెట్టారు. "నేను ఆ ట్వీట్‌ను పూర్తిగా చూడకుండా ఉత్సాహంతో రిప్లై ఇచ్చాను. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించండి" అంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. గతంలో తాను ‘పోకిరి’ సినిమా గురించి, మహేష్ బాబు నటన గురించి ఎంత గొప్పగా చెప్పానో ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారణాసి వంటి ఇంటర్వ్యూల్లో తాను సూపర్ స్టార్‌ను పొగిడిన విషయాలను ఉదహరిస్తూ ఫ్యాన్స్‌ను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
ఒకవైపు ఇలాంటి సోషల్ మీడియా వివాదాలు నడుస్తున్నా, మరోవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. మార్చి 19న సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తయిపోయాయి కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు.అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’లో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబో అంటేనే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం.గతంలో ఒక అప్‌కమింగ్ డైరెక్టర్ చిరంజీవి గారిని ఉద్దేశించి పాత ట్వీట్ బయటకు తీసినప్పుడు జరిగిన రచ్చ మనందరికీ తెలిసిందే. అందుకే హరీష్ శంకర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా డ్యామేజ్ కంట్రోల్ చేయడం మంచి పరిణామం. హీరోలు అందరూ ఒక్కటే అని, రికార్డులు అనేవి మారుతూ ఉంటాయని ఫ్యాన్స్ గుర్తించాల్సిన సమయం ఇది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి