స్క్రిప్ట్ ఇంకా ఫినిష్ కాలేదా?: సుకుమార్ టీమ్‌లోని ఒక అసిస్టెంట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, సుకుమార్ మరిన్ని మార్పులు చేస్తున్నారని వస్తున్న వార్తలతో ఫ్యాన్స్‌లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే, సుకుమార్ లాంటి డైరెక్టర్ టైమ్ తీసుకుంటున్నారంటే అది బాక్సాఫీస్ దగ్గర ‘సునామీ’ రావడానికే అని విశ్లేషకులు అంటున్నారు.
మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రోజు మార్చి 27.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC17 గురించి ఒక పవర్ ఫుల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. టాలీవుడ్‌లో స్టార్ హీరోల బర్త్‌డే అంటేనే కొత్త సినిమాల అప్‌డేట్స్‌కు కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) అనే స్పోర్ట్స్ డ్రామాలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా కంప్లీట్ అవ్వగానే సుకుమార్ రంగంలోకి దిగనున్నారు. ఈ గ్యాప్‌లో సుకుమార్ స్క్రిప్ట్‌ను పక్కాగా లాక్ చేసే పనిలో ఉన్నారు.
మెగా పవర్ స్టార్ సినిమా అప్‌డేట్ రావడం బాక్సాఫీస్ దగ్గర హీట్ పెంచేస్తోంది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్‌కు, సుకుమార్ ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.అయితే RC17 అనౌన్స్‌మెంట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి