సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత సింపుల్గా చేసుకుంటారో విడాకులు కూడా అంతే సింపుల్గా తీసుకుంటారు. విడాకుల తర్వాత మళ్లీ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా వారి లోపల ఎంత బాధ ఉంటుందో తెలియదు కానీ బయటికి మాత్రం మూవ్ ఆన్ అయిపోయినట్టు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు. అయితే తాజాగా బన్నీ హీరోయిన్ కూడా విడాకులు తీసుకున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది.చాలా రోజుల నుండి ఆ హీరోయిన్ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఆ హీరోయిన్ నోరు విప్పలేదు.కానీ తాజాగా మాత్రం ఈ హీరోయిన్ విడాకులు తీసుకున్నట్టు స్పష్టం అవుతుంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే హన్సిక మోత్వాని.చిన్న ఏజ్ లోనే దేశముదురు సినిమాతో అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా నటించిన హన్సిక మోత్వాని ఆ తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీని దున్నేసింది అని చెప్పుకోవచ్చు. 

చాలా సంవత్సరాలు సౌత్ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అవకాశాలు లేక కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చింది.అదే సమయంలో సోహైల్ కతూరియాని పెళ్లి చేసుకొని ఓ ఇంటిదయ్యింది. అయితే హన్సిక పెళ్లి సమయంలో చాలానే ట్రోలింగ్ పాలయింది.దానికి కారణం హన్సిక అప్పటికే పెళ్లయిన సోహైల్ కి రెండో భార్యగా వెళ్ళింది.. ఎందుకంటే హన్సిక తన ఫ్రెండ్ భర్తని పెళ్లి చేసుకుందని తెగ ట్రోలింగ్ చేశారు. స్నేహితురాలు కాపురంలో హన్సిక చిచ్చుపెట్టిందని సోహైల్ ని పెళ్లాడింది అని ప్రచారం చేశారు.కానీ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక సోహైల్ ల బంధం కనీసం నాలుగు సంవత్సరాలు కూడా నిలవలేకపోయింది.

 చివరికి హన్సిక సోహైల్ కి విడాకులు ఇచ్చింది. చాలా రోజుల నుండి హన్సిక సోహైల్ కి దూరంగా ఉండటంతో హన్సిక కూడా విడాకులు తీసుకోబోతుంది అనే ప్రచారం జరిగింది. సోహైల్ ఇంట్లో ఉండే కట్టుబాట్లు నచ్చక హన్సిక పుట్టింటికి వచ్చేసిందని,సోహైల్ ది ఉమ్మడి కుటుంబం కావడంతో వేరే కాపురం పెడదామని చెప్పినా వినకపోవడంతో చివరికి సోహైల్ తో విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులకు అప్లై చేసినట్టు వార్తలు వినిపించాయి. అలా ఫైనల్ గా సోహైల్ హన్సిక ఇద్దరూ విడాకులు తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. కానీ
 ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే గానీ అభిమానులకు క్లారిటీ రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: