ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అనుకోని స్థాయిలో, ఊహించని విధంగా భారత్లోకి అడుగుపెట్టనుంది.భారతదేశంలో ఏర్పడుతున్న చమురు కొరత కారణంగా మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని ఎప్పటినుంచో మనదేశం అనుకుంటున్న సంగతి తెలిసిందే. అదే తడవుగా ఇప్పుడు సరికొత్తగా టెస్లా తన ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడానికి మన దేశానికి రాబోతున్నట్టు ప్రకటించింది.ఇప్పుడు ఆ తయారీ సంస్థ వివరాలు ఏంటో చూద్దాం.

పూర్తి వివరాల్లోకి వెళితే దిగ్గజ అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టింది.అంతేకాకుండా బెంగళూరులో ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ గా ఆర్ ఓ సి వద్ద కంపెనీని రిజిస్టర్ చేసుకుంది.  ఇక ఈ కంపెనీకి ముగ్గురు డైరెక్టర్లు సభ్యత్వం వహించనున్నారు. టెస్లా అనుబంధ సంస్థగా భారతీయ మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీ డైరెక్టర్లుగా వైభవ్ తనేజా, వెంకట్ రంగం శ్రీరామ్, డేవిడ్ జాన్ ఫీన్ స్టీన్ లు నియమితులయ్యారు.  ఇక టెస్లా తన చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్గా వైభవ్ తనేజా ను  నియమించినట్లు సమాచారం.

ఇక నివేదిక ప్రకారం రూ. 1.5 కోట్ల మూలధనంతో టెస్లా తన కొత్త  కంపెనీ ని బెంగళూరులో రిజిస్టర్ చేసుకుంది.అయితే తయారీ కేంద్రం ఆర్ అండ్ డీ  సెంటర్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనే  నేపథ్యంలో మహారాష్ట్ర,గుజరాత్,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,తమిళనాడు వంటి ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. అదే నేపథ్యంలో గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ను కూడా నియమించుకుంది టెస్లా.

ఇక టెస్లా కంపెనీని  ఆహ్వానించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే వివిధ సెగ్మెంట్లలో కంపెనీ లొకేషన్ ఆప్షన్లని ఇచ్చినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఒక టెస్లా కంపెనీ తయారు చేయబోయే కారు ఎలక్ట్రిక్ మోడల్ త్రీ సెడాన్. దీని ధర మన భారతీయ మార్కెట్లో  రూ.60 లక్షలు ఉంటుంది.  2021 జనవరిలోనే భారత్లోకి టెస్లా  ప్రవేశిస్తుందని డిసెంబర్లోనే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇక త్వరలోనే అన్ని పెట్రోల్ పంపుల  వద్ద ఎలక్ట్రిక్ చార్జింగ్ కి కియోస్క్ ని  ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం టెస్లా  తన కారు మోడల్ త్రీ ను  మాత్రమే భారత్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇక దీని లోపల 60 కిలోమీటర్లు  లిథియం బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. వాహనం టాప్ స్పీడ్  162 ఎం పి హెచ్.

మరింత సమాచారం తెలుసుకోండి: