మంచి బ్యాంక్ :
బ్యాంకులు అందించే పెట్టుబడుల కు డిపాజిటరీ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం కింద రక్షణ ఉంటుంది. దీని ప్రకారం, ప్రతి పెట్టుబడి కి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఒకవేళ ఏదైనా కారణాల తో బ్యాంకు దివాలా తీస్తే.. పెట్టు బడిదారులు బ్యాంకు లో చేసిన డిపాజిట్ల పై రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. అందుకే ఒకే బ్యాంకు లో డబ్బులు దాచుకోవడం కన్నా కూడా వివిధ బ్యాంకుల లో డబ్బులను దాచుకుంటే సేఫ్.
వడ్డీ :
ఎఫ్‌డీల మెచూరిటీ లేదా టెన్యూర్ ఆధారం గా బ్యాంకులు వడ్డీ రేట్ల ను నిర్దేశిస్తాయి. వడ్డీ రేట్లు బ్యాంకుల ను బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఇది డిపాజిటర్ వయస్సు మీద కూడా ఆధారపడి ఉంటుంది. బల్క్ లేదా లంప్‌సమ్ డిపాజిట్ల పై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్ల కు 0.5 శాతం వరకు ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి.
లోన్:
ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై పెట్టు బడిదారులు లోన్ తీసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తాయి. ఎఫ్‌డీల ప్రయోజనాల్లో ఇది కూడా ఒకటి. అత్య వసర పరిస్థితులు ఎదురైనప్పుడు, కస్టమర్లు ఎఫ్‌డీల పై లోన్ తీసుకోవచ్చు. వారు చేసిన డిపాజిట్ లో 90 శాతం వరకు లోన్ పొందవచ్చు. వీటీపీపై లోన్లను ఎంతవరకు పొందవచ్చు.. ఇవన్నీ చూసుకోవాలి.
ప్రీ మెచూర్ విత్‌డ్రా, మొదలగు అంశాల ను దృష్టిలో ఉంచుకొని ఈ డిపాజిట్ల ను చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి