కరోనా మహమ్మారి వల్ల చాలా మందికి జీవితం మీద ఆశలు పోయాయి. ఎవరు ఎప్పుడు కరోనా వేటుకు బలవుతారో.. అయితే కొంత మంది మాత్రం ఉన్నదానితో సరిపెట్టుకోరు.. కొత్తగా ఏదైనా తీసుకురావాలి.. లేదా ఉన్న చోటనే కూర్చొని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అది కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందేలా ఉండాలని భావిస్తారు అలాంటి వాళ్ళుకు అదిరి పోయే బిజినెస్ ఐడియా ఉంది..


ఇది చాలా సులువైన పని.. ఉన్న చోటే పని.. జంతు ప్రేమికుల కు మాత్రం ఇది సంతోషాన్ని ఇస్తుంది. అదేంటో అస్సలు ఆలస్యం చేయకుండా చూసేద్దాం.. అది కుందేళ్ళ పెంపకం. తక్కువ ఖర్చుతో పని మొదలు పెట్టి ఎక్కువ లాభాలను పొందవచ్చు.. అదెలానో చూడండి.. ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలంటే మీ సేవ కేంద్రానికి వెళ్లి కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ పేరు మీద సదరు వ్యక్తికీ ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. ఇకపోతే మరో చక్కని అవకాశం ఏంటంటే.. ముద్ర స్కీమ్ కింద 50 వేల నుంచి లక్ష వరకు లోన్ కూడా పొందవచ్చునట.


వీటిని పెంచడాని కి కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి..  పరిశుభ్రంగా ఉంటె సరిపోతుంది. అయితే మీరు 50 కుందేళ్ళను పెంచాలని అనుకుంటే  50 కుందేళ్ళ పెంపకానికి రూ.4000 పెట్టుబడి పెడితే సరిపోతుంది. కుందేళ్ళ కు ఆహారంగా ఎండిన గడ్డి, క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, క్యాలీ ఫ్లవర్ ఆకులు వంటివి కావాలి. నీటిని పెట్టడానికి  చిన్న మట్టి కుండలు కావలి. ఈ కుందేళ్లు సంవత్సరానికి 6 నుంచి 8 పిల్లలను పెడతాయి. ఇళ్లలో పెంచుకోవడానికి కుందేళ్లను కొనుక్కుంటారు. తక్కువ శ్రమ, తక్కువ ఖర్చు తో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. మీకు ఈ బిజినెస్ ఐడియా నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి.. లాభాలను పొందండి..

మరింత సమాచారం తెలుసుకోండి: