కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ సొంతంగా తయారు చేసిన వ్యాక్సిన్ కోవాగ్జిన్. హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. ఇప్పుడు దీనిని అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చాలనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌లో కోవాగ్జిన్ టీకాను అత్యవసర వ్యాక్సిన్ల జాబితాలో చేర్చిన మోదీ సర్కార్... ప్రజలకు అందిస్తోంది కూడా. దేశంలో దాదాపు 75 కోట్ల మందికి ఇప్పటికే టీకా డోసులు అందించారు. ఇందులో సుమారువ 35 కోట్ల మందికి కోవాగ్జిన్ టీకాను వైద్య సిబ్బంది అందినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ ప్లాట్ ఫామ్‌పై కూడా కోవాగ్జిన్ టీకాకు ఎలాంటి ఇబ్బందులు రావని భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించారు.

స్వతంత్ర నిపుణుల బృందంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వచ్చే వారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి మూడు దశల క్లీనికల్ ట్రయల్స్ డేటా, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత వంటి అంశాలను డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు చర్చించనున్నారు. పూర్తి సమీక్ష అనంతరం అత్యవసర వినియోగ జాబితాలో కోవాగ్జిన్ టీకాను చేర్చే అంశంపై ఒక ప్రకటన చేస్తారని భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. టీకా వినియోగానికి సంబందించిన ఎక్స్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ డేటాను భారత్ బయోటెక్ సంస్థ డబ్ల్యూహెచ్‌వో సంస్థకు సమర్పించింది. అదే సమయంలో వ్యాక్సిన్ డేటా రోలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించామన్నారు. ఫైజర్ సంస్థ కలిసి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉంది. అయితే... కోవాగ్జిన్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అభివృద్ధి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: