అమ్మబాబోయ్ ఇంత పెరిగిందా ?

ఇందనం ధరలు.. ముఖ్యంగా పెట్రోల్, డీజల్ ధర నిత్యం అంత కంతకూ పెరుగుతోంది. పెట్రోల్ ధర ఏడాదిలో ఎంత శాతం పెరిగిందో తెలుసా? పోనీ డీజల్ ధర ఎంత శాతం పెరిగిందో తెలుసా ? అంతర్జాతీయ మార్కెట్ ను అనుసరించి , అక్కడి ఒడిదుడుకులను అనుసరించి ఇంధనం ధరలు పెరుగుతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మరీ ఇంత పెరిగిందా ? అన్న అనుమానం ఒక సారి గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఒక లీటరు పెట్రోల్, డీజల్ లో మనం ఎంత  పన్ను చెల్లిస్తున్నామో తెలుసా ? అధికారిక గణాంకాలను ఒక సారి పరిశీలించండి.


పెట్రోల్ ధర ఒక సంవత్సరంలో  32 శాతం , రెండేళ్లలో 46 శాతం పెరిగింది. అదే డీజిల్ ధర ఏడాదిలో 35 శాతం పెరగ్గా, రెండేళ్లలో 45 శాతం పెరిగింది. భారత దేశం ఇంతవరకూ ఇలాంటి ధరల పెరుగుదలను చూడలేదు. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు గత నెల రోజులుగా ప్రతి రోజూ ఇంధనం ధరలను పెంచుతున్నాయి.
పెట్రోల్ ధర రెండేళ్లలో అక్షరాల 34 రూపాయలు పెరిగింది. ఏడాదిలో 26 రూపాయలు పెరిగింది.  గ్లోబల్ ఆయిల్ ప్రైజ్ కు అనుగుణంగా ఈ పెరుగుదల వచ్చిందని  ఇంధన శాఖ అధికారులు పేర్కోంటున్నారు. అదే విధంగా డీజిల్ ధర రెండేళ్లలో  రూ.29.50 పెరగ్గా,  25 రూపాయలు ఏడాదిలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో  ముడి ఇంధనం, క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగాపెరిగాయి. గతంలో ఒక బ్యారన్ ధర ఎనిమిది డాలర్లు ఉండగా, ప్రస్తుతం 84 డాలర్ లకు చేరుకుంది. ఈ ప్రభావం భారత్ పై పడిందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. దాదాపు 40 శాతం పైగా ఇంధనం ధరలు పెరిగి , భారత్ కు పెనుభారం అయ్యాయని వారు తెలిపారు.
 కరోనా మహమ్మారి కారణంగా కోంత కాలం చమురు బావుల్లో నుంచి చమురు వెలికి తీయలేదు. దీంతో ఇంధనం కొరత ఏర్పడింది. సహజంగానే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఆ ప్రభావం భారత్ పై పడింది. కరోనా కొంత తగ్గుముఖం పట్టినా, చమురు బావుల్లో నుంచి ముడి ఇంధనం వెలపలికి వస్తున్నా భారత్ లో ఆయిల్ ధరలు మాత్రం  ఆకాశాన్నంటుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ వాడకం దారులపై వివిధ రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు తలా ఒక రీతిన ఉన్నాయి.  ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని తీసుకుందాం.  అక్కడ లీటరు పెట్రోలు కొనుగోలు చేస్తే రూ.57.24 పైసలు పన్ను రూపేణా ప్రభుత్వానికి చెందుతుంది. అదే డీజల్ కొనుగోలు చేస్తే.రూ.45.57  పైసలు ప్రభుత్వనికి చేరుతుంది. వివిధ రాష్ట్రాలు వారి వారి ఖజానా లోటును బట్టి సామాన్యులపై పన్నుభారం మోపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: