ఇక మార్కెట్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా, కస్టమర్ల అవసరాలను క్యాష్‌ చేసుకుంటూ కొత్త వ్యాపార ఐడియాలతో ముందుకు వెళితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.ప్రస్తుతం ప్రతీ ఇంట్లో పొద్దున తీసుకునే టిఫిన్‌లో పోహాను తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పోహా వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు చాలా ఎక్కువ.ఉదయం పోహాను టిఫిన్‌గా తీసుకుంటే ఆ రోజంతా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి కూడా పోహా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.ఎందుకంటే పోహాలోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ క్రియ సమస్యలు దరిచేరకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే శరీరానికి అవసరమైన ఇన్‌స్టాంట్‌ శక్తిని అందిస్తుంది. అందుకే పోహా తయారీ కేంద్రాన్ని స్టార్ట్ చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ పోహా తయారీ యూనిట్‌ను ఎలా స్టార్ట్ చెయ్యాలి.? ఇందుకు అవసరమయ్యే ఖర్చు ఎంత.? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పోహా తయారీ యూనిట్‌ను ప్రారంభంలో రూ. 25,000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. పోహా తయారీ యూనిట్‌ను ప్రారంభించడానికి కనీసం ఒక 500 గజాల స్థలం అవసరం అవుతుంది. అలాగే ముడి సరకుతో పాటు విద్యుత్ సరఫరా, తయారీ కేంద్రం రెడీ చేయడానికి కావాల్సిన అనుమతులు ఖచ్చితంగా ఉండాలి. ఇంటి మేడపై కూడా ఈ యూనిట్‌ను రెడీ చేసుకోవచ్చు.ఇక ఈ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం కూడా రుణం అందిస్తుంది. పోహా తయారీ యూనిట్‌ ద్వారా మొదట్లో కనీసం రూ. 30 నుంచి ఆదాయంని పొందొచ్చు.అయితే మార్కెటింగ్ బాగా చేసుకొని, తయారీ యూనిట్‌ను విస్తరిస్తే నెలకు ఖచ్చితంగా రూ. 2 లక్షల వరకు కూడా సంపాదించొచ్చు. సొంతంగా ఒక బ్రాండ్‌ను రూపొందించుకొని, నేరుగా దుకాణాల్లోకి వెళ్లి అమ్ముకుంటే ఖచ్చితంగా ఎన్నో లాభాలు పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: