కార్పొరేట్ లో పనిచేసే ఉద్యోగులు నిత్యం ఉద్యోగాలు మారుతూ ఉంటారు. కొన్నిసార్లు జీతాల కోసం, కొన్నిసార్లు హోదాల కోసం, మరి కొన్నిసార్లు ఇతర ప్రయోజనాల కోసం ఉద్యోగాలు మారుస్తూ వారి వారి స్థాయిని పెంచుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే ఉద్యోగాలు మారడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఉద్యోగులు కూడా జాబ్ మారడం ద్వారా 30 నుండి 40 శాతం జీతాలను పెంచుకుంటున్నారు. కొన్నిసార్లు అయితే 100 శాతం జీతాలు కూడా పెరుగుతున్నాయి.

అయితే తాజాగా ఉద్యోగికి ఏకంగా 700 శాతానికి పైగా జీతం పెరిగింది. నమ్మలేకపోతున్నారు కదా కానీ అదే నిజం. ఢిల్లీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఒకేసారి 700 శాతానికి పైగా జీతం పెరిగింది. ఆయన ఒక జాబ్ నుండి మరొక జాబ్ కి మారుతుండగా.. ఇంత జీతం పెరగడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రముఖ టెక్ కంపెనీలో పని చేసే ఉద్యోగి వేతనం రూ. 5.5 లక్షలు .. అతను జాబ్ మారడంతో కేవలం ఏడాదికే రూ.  45 లక్షలు తీసుకుంటున్నాడు.  ఈ విషయాన్ని నేరుగా ఉద్యోగి తన సోషల్ మీడియా అకౌంట్ లో తెలియజేశాడు. ఇంకేముంది ఆ పోస్ట్ ప్రతి ఒక్కరిని దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ అందరూ లక్ అంటే నిదే భయ్యా అంటూ కామెంట్స్ 
పెడుతున్నారు.

సాఫ్ట్ వేర్ డెవలపర్ దేవేష్ ప్రారంభ వేతనానికి 9 రేట్లు సంపాదిస్తున్నాడట. అది కూడా ఆయన ఒక గ్లోబల్ టెక్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం వల్లే జరిగిందని చెప్పారు. అలాగే ఇప్పుడు కొత్తగా కెరీర్ మొదలుపెడుతున్న వారికి సూచనలు కూడా ఇచ్చారు. నైపుణ్యాలను పెంచుకోవడం, పని నేర్చుకోవడం ముఖ్యమని తెలిపారు. ఆ తర్వాత తప్పకుండా మంచి వేతనాలు వస్తాయని సాఫ్ట్ వేర్ డెవలపర్ దేవేష్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: