మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది..ఇంట్లో బయట అని తేడా లేకుండా భాదలకు, హింసలకు కూడా గురి అవుతున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే వరకట్న వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతూన్నాయి. అదనపు కట్నం కోసం అత్తింటి వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారు.ఆ బాధలు భరించలేక ప్రాణాలను తీసుకున్న మహిళలు ఎందరో ఉన్నారు.చాలా మహిళలు ప్రాణాలను కూడా తీసుకున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. కూతురు కోసం మంచి సంబంధం తీసుకొస్తె సుఖ పడుతుందనే ఉద్దేశ్యం తో ఎన్నారై సంబందాల వైపు మొగ్గు చూపుతున్నారు.వారి గురించి ఆరా తీయకుండానే అడిగింది.దానికి కన్నా ఎక్కువ కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేస్తున్నారు. తర్వాత కొన్నాల్లకు వాళ్ళ బుద్ది బయట పెడుతున్నారు.
 

తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.పెళ్లై 20 రోజుల కూడా గడవకముందే భార్యను ఎన్నారై భర్త తనకు ఇవ్వాల్సిన కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఆ సమయానికి ఆమె ఇవ్వకపోవడంతో భార్యను ఇక్కడే ఒంటరిగా వదిలేసి దుబాయ్‌కి చెక్కేశాడు.వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పరిధిలోని వెజల్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల యువతికి గతేడాది ఆగస్టులో అదే ప్రాంతానికి చెందిన దుబాయ్‌లో పనిచేసే ఓ వ్యక్తితో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆమె తల్లితండ్రులు వరుడికి రూ.5లక్షలు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. కానీ, పెళ్లిరోజు కేవలం రూ.3లక్షలు మాత్రమే సర్దారు.ఇంకో రెండు లక్షలను తర్వాత ఇస్తామాని చెప్పారు. కానీ సరైన సమయానికి డబ్బులు దొరకలేదు.2లక్షలు తేస్తేనే తనతో పాటు దుబాయ్‌కి తీసుకెళ్తానని, లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్లిపోతానని బెదిరించాడు. కట్నం గొడవ జరుగుతుండగానే భర్త థాయ్‌లాండ్‌కు చెందిన సెక్స్ వర్కర్లతో చాటింగ్ చేయడం భార్య కంటబడింది. ఆ విషయమై నిలదీయడంతో భార్యను తీవ్రంగా కొట్టాడు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత భార్యకు తెలియకుండా ఆమెను ఇక్కడే ఒంటరిగా వదిలేసి దుబాయ్‌కి వెళ్లిపోయాడు...దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది..పోలీసులు జరిగిన విషయాన్ని చెప్పి, ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి రప్పించె ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: