ప్రతి పేదవాడికి ఉండే ఒకే ఒక కల.. ఒక అందమైన సొంత ఇల్లు కట్టుకోవాలని. దీని కోసం ఎన్నో ఏళ్ళపాటు చెమటోడ్చి కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఇక ఇల్లు కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతోమంది పేద మధ్య తరగతి ప్రజలు. ఇక ఇల్లు కట్టుకుంటే తమ జీవితంలో అన్నీ సాధించినట్లే అని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఓ వృద్ధురాలు కూడా ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకుంది. ఈనెల 1వ తేదీని గృహ ప్రవేశం కూడా చేసింది. కానీ అంతలోనే ఆమె కలల సౌధం ప్రకృతి విపత్తులో నాశనమైపోయింది. దీంతో ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇల్లు వరదలో మునిగి పోవడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది .


 చివరికి అదే బాధతో మనస్తాపం చెంది  బాధపడుతూ వచ్చింది. చివరికి కఠిన నిర్ణయం తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముకు తోడు కొంత అప్పు చేసి కలల ఇంటి నిర్మించుకోగా ఇక ఆ ఇల్లే చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. సిద్ధి వీరయ్య- జమున దంపతులు బాలాజీ నగర్ లో ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే ఇంకా మొదటి అంతస్తు పనులు జరుగుతూ ఉండగా.. జూలై 1వ తేదీన గృహప్రవేశం కూడా చేశారు.


 అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద నీటిలో ఇక ఆ దంపతులు కట్టుకున్న ఇల్లు మునిగిపోయింది. పూర్తిగా బురద పాలయింది. దీన్ని చూసిన జమున మనసు కలత చెందింది. ఈ క్రమంలోనే ఇటీవల తెల్లవారుజామున 5 గంటల సమయంలో మొదటి అంతస్తులోని పిల్లర్ కు  చీర కట్టి ఇక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇక ప్రస్తుతం భర్త వీరయ్య కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఇన్నాళ్లు కష్టపడిన సొమ్ము తో అప్పుచేసి కట్టుకున్న ఇల్లు వరదలో మునిగి పోవడం తోనే తమ తల్లి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: