సాధారణంగా మనం దారిలో వెళ్తున్నప్పుడు దూరంగా ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగ్ లేదా బాక్స్ లాంటిది కనిపించింది అంటే చాలు.. ఇక మన మనసు మొత్తం దానిపైనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలుసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా అనుమానాస్పదంగా ఏదైనా బ్యాగ్ కనిపించిందంటే  అందులో ఏదో ఉండే ఉంటుంది అని ఆలోచనలో పడి పోవడం లాంటివి చేస్తూ ఉన్నారు అనే చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి అనుమానం తోనే  బ్యాగులను తెరిచి చూసి అవాక్కవడం లాంటివి జరుగుతున్నాయి అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కోల్కతాకు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హౌరా జిల్లాలో  దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి.. ముడాలగి బస్టాండ్ సమీపంలో డ్రైనేజీలో ఏవో బాక్సులు తేలడానికి గమనించారు చెత్త ఏరుకునే వ్యక్తులు. అయితే ఆ బాక్సులు కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో లోపల ఏముంది అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరికి ఆ బాక్సులను ఓపెన్ చేసి చూడగా లోపల పసికందు పిల్లల మృతదేహాలు  ఉండడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


 దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, జిల్లా పౌర ఆరోగ్య శాఖ అధికారులు మొత్తం ఐదు బాక్స్ లో  18 పిండాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్టుమార్టం నిర్వహించడం కోసం ఆస్పత్రికి తరలించారు అన్నది తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సదరు పిండాలు కనిపించినా డంపింగ్ గ్రౌండ్ కు రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు 30 హాస్పిటల్స్ తో పాటు నర్సింగ్ హోమ్ లు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: