ఇటీవలి కాలం లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతోంది అనే చెప్పాలి . ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు వాహన దారులు అందరూ కూడా ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించేలా చర్యలు చేపడుతూ ఉన్నప్పటికీ అటు రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ఎంతో మంది తల్లి దండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది..  విద్యార్థులు ప్రయాణిస్తున్న ఒక ఆటో ని అతి వేగంగా దూసుకు వచ్చిన లారీ ఢీకొట్టింది. ఇంటికి వెళ్తున్నాము అని విద్యార్థులు సంతోషపడుతున్న సమయంలోనే ఇంటికి వెళ్లే లోపే అంతా జరిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్  చికిత్స పొందుతున్నాడు. కుషాయిగూడ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తా లోని శ్రీ చైతన్య స్కూల్ లో చదువుతున్నారు విద్యార్థులు.


 అయితే చర్లపల్లి పారిశ్రామిక వాడలోని జైలు మలుపు వద్ద అతి వేగంగా దూసుకు వచ్చిన లారీ అదుపుతప్పి ఆటో ని ఢీకొట్టింది. దీంతో ఆటో  డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ఒక్కసారిగా ధ్వంసం అయింది అనే చెప్పాలి. శ్రామిక వాడలో ఉన్న కార్మికులు  గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు అని చెప్పాలి. కాగా సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ ఘటన జరిగిన నేపథ్యంలోఇక అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: