
అలా కని పెంచిన తల్లిని ఎంతో ఆప్యాయంగా చూసుకోవాల్సిన కొడుకు ఏకంగా కన్న పేగు బంధం పైనే కన్నేసాడు. ఏకంగా తల్లితోనే నీచంగా ప్రవర్తించాడు. దీంతో కొడుకు తీరుతో ఎంతో ఇబ్బందులు పడింది ఆ తల్లి. అయితే కన్నతల్లినైనా తన విషయంలోనే ఇలా ఉంటే ఇక మిగతా ఆడవాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో ఎందరి జీవితాలను నాశనం చేస్తాడో అని భావించిన తల్లిదండ్రులు కన్న ప్రేమను సైతం పక్కనపెట్టి గుండెను రాయి చేసుకుని కొడుకును చంపేసేందుకు మేనమామకు సుపారీ ఇచ్చారు.
ఈ ఘటన తెలంగాణలోని సూర్యపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇటీవల పాలకవీడు మండలం శూన్యం పహాడ్ దగ్గర మూసీ నదిలో గుర్తుతెలియని శవం లభ్యమయింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన సాయినాథ్ గా గుర్తించారు పోలీసులు. రామ్ సింగ్, రాణి బాయ్ కి కుమారుడు సాయినాథ్ ఉన్నాడు. రామ్ సింగ్ సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. కుమారుడు సాయినాథ్ చదువు మధ్యలోనే ఆపేసి చెడు వ్యసనాలకు బానిసగా మారిపోయాడు. అంతే కాదు కన్నతల్లితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్ళు అతను వేధింపులు భరించిన తల్లిదండ్రులు చివరికి గుండెను రాయి చేసుకుని అతన్ని దారుణంగా హత్య చేశారు. ఇక పోలీస్ దర్యాప్తులో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.