ఇటీవల కాలంలో ప్రేమున్మాదులు  రెచ్చిపోతూ దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  కొంతమంది ఇప్పటికే ప్రేమ అనే ముసుగు వేసుకొని అవసరాలు తీర్చుకొని వదిలేస్తూ ఉంటే.. మరి కొంతమంది తమ ప్రేమను అంగీకరించలేదని లేదంటే.. తమను దూరం పెడుతూ మరొకరితో మాట్లాడుతున్నారు అన్న కారణంతో ప్రేమించిన వారి మీదే కక్ష పెంచుకుంటూ దారుణంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ప్రేమ అనే పేరు వినిపిస్తే చాలు నేటి రోజుల్లో యువత ఉలిక్కిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి.


 అయితే సాటి మనిషిని హత్య చేస్తే దారుణమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది అన్న భయం మాత్రం ఎవ్వరిలో కనిపించడం లేదు. వెరసి ప్రేమోన్మాధులు ఎంతో మంది రెచ్చిపోతున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. తన ప్రేమను నిరాకరించింది అన్న కోపంతో ఒక ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఏకంగా యువతి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని విలుపూరం జిల్లా రాధాపురం గ్రామంలో వెలుగు చూసింది. సుధన్ అనే వ్యక్తికి ధరణి అనే 20 ఏళ్ల కుమార్తె ఉంది. అదే ప్రాంతంలోని నర్సింగ్ కళాశాలలో చదువుతుంది.


 కాగా మధుర పాక్కం గ్రామానికి చెందిన యువకుడు గణేషన్ మూడేళ్ల నుంచి ధరణిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె పేరును గుండెపై పచ్చబొట్టు కూడా వేసుకున్నాడు. అయితే అప్పటికే గణేషన్ పై ఒక హత్యకు సంబంధించిన కేసు నమోదవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితేవిషయం తెలిసిన ధరణి ఒక్కసారిగా భయపడిపోయింది. అతనితో మాట్లాడటం మానేసింది. దీంతో ఇద్దరీ మధ్యలో గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇక ఇటీవల యువతి ఇంటి ఆవరణలో ఉండగా అక్కడికి వచ్చిన గణేషన్ దారుణంగా కత్తితో గొంతు కోసి పారిపోయాడు. దీంతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన ధరణి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: