సాధారణంగా చాలామంది ఇంట్లో ఎలుకల బెడద అనేది కామన్. ఇక ఇలా ఎలుకల బెడదను నివారించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆయా కుటుంబాల్లోని సభ్యులు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఎలుకల కోసం బోన్లు ఏర్పాటు చేయడం మరికొన్నిసార్లు ఏదో ఒక ఆహారంలో మత్తుమందు కలిపి ఎలుకలను చంపాలి అనుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎలుకలను చంపడం అందరూ కూడా ఏదో ఒక సమయంలో చూడటం మాత్రమే కాదు చేసి కూడా ఉంటారు.


 కానీ ఎలుకను చంపడం కారణంగా జైలు శిక్ష పడుతుంది అంటే మాత్రం ఎవరైనా నమ్ముతారా. అదేంటి ఎలుకను చంపితే కూడా జైల్లోకి పంపిస్తారా. ఇది ఎక్కడ ఇప్పటివరకు వినలేదు అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే. ఒక ఎలుకను చంపిన హత్య కేసు కోర్టుకు చేరింది. ఇక ఇప్పుడు నిందితులకు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. నేను చెప్పేది మీకు జోక్ లాగే ఉండొచ్చు. కానీ ఇది ఉత్తర ప్రదేశ్ లోని బాడౌన్ లో నిజంగానే జరిగింది. ఏకంగా ఎలుక హత్య కేసులో 30 పేజీల చార్జి షీటును దాఖలు చేశారు.



 ఈ ఛార్జ్ షీట్లో ఏకంగా ఎలుక పోస్టుమార్టం నివేదికను కూడా చేర్చారు అని చెప్పాలి. ఈ చార్జీ షీట్ ఆధారంగా కోర్టు ఈ కేసులో తీర్పును వెలువరించాల్సి ఉంది. ఇంతకీ ఎలుక మరణం ఎప్పుడు సంభవించిందో తెలుసా.. గత ఏడాది నవంబర్ 25వ తేదీన ఒక నీటి మనిషి ఎలుకను కాలువలో ముంచి చంపాడు. జంతు ప్రేమికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి మనోజ్ అనే వ్యక్తి ఎలుకను పట్టుకున్నాడు. దీని తర్వాత ఎలుకను కాలువలో ముంచాడు. ఎలుక పొట్టకు రాయి కట్టాడు. అదే సమయంలో జంతు ప్రేమికుడు వికేంద్ర శర్మ అడ్డుగా వెళ్ళాడు. ఆ ఎలుకను రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ ఎలుక అప్పటికే చనిపోయింది. ఎలుకకు ఇంత బాధాకరమైన మరణం ఇవ్వడాన్ని చూసి కోపంతో మనోజ్ పై కేసు వేయగా.. 30 పేజీలు చార్జ్ షీట్ నమోదు చేశారు. అయితే ఇక ఈ కేసులో జంతు హింస చట్టం కింద అటు నిందితులకు శిక్ష పడుతుందని తెలుస్తుంది. ఒకవేళ నేరం రుజువైతే పది రూపాయల నుంచి 2000 వరకు జరిమానా ఐదేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: