ఒకసారి వాహనంతో రోడ్డు మీదికి వెళ్ళిన తర్వాత ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనం జాగ్రత్తగా ఉన్నా ఇక ఎదుటివారు రోడ్డు నిబంధనలను పాటించకుండా ప్రమాదానికి కారణం అవుతూ ఉంటారు. ఇంకొన్నిసార్లు ఇక చేజేతులారా ఎంతోమంది నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నేటి రోజుల్లో రయ్ రయ్ మంటూ అత్యంత వేగంగా కొద్దూసుకుపోయే వాహనాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా నెమ్మదిగా వాహనాన్ని నడపడానికి ఇష్టపడటం లేదు.


 వాహనాన్ని కంట్రోల్ చేయలేనంత వేగంతో బండిని నడుపుతూ చివరికి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఇక ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చాలనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వీడియోలలో కొన్ని గగుర్పాటుకు గురి చేసే వీడియోలు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అత్యంత వేగంతో దూసుకు వచ్చిన కారు అదుపుతప్పి సృష్టించిన బీభత్సం చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఈ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.


 కేరళలోని పతనం తిట్టపరిది కురంబాల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళుతున్న నల్ల రంగు ఎస్యువి కారు అదుపు తప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న ఒక కారుని రెండు స్కూటర్లను కూడా బలంగా ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న ఒక షాపులోకి దూసుకుపోయింది ఆ కారు. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి అన్నది తెలుస్తుంది. ఇక అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రోడ్డు ప్రమాదం కి సంబంధించి వీడియో రికార్డు అయింది. ఇక ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: