ఇటీవల కాలంలో మనిషి పూర్తిగా కమర్షియల్ గా మారిపోయాడు.. ఏదైనా ఉపయోగముంటుంది అంటేనే ఇతరులతో మాట్లాడటం చేస్తున్నాడు. ఇక ఏం ఉపయోగం లేదు అనుకుంటే పక్కనున్న వాళ్ళను కూడా పట్టించుకోకుండా... కనీసం పక్కనున్న వాళ్ళని కన్నెత్తి కూడా చూడకుండా తన దారిన తాను వెళ్ళిపోతున్న  పరిస్థితులు నేటి రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇలా స్వార్థపూరిత ఆలోచనలతో నిండిపోయిన మనుషుల్లో అటు మానవత్వం జాలి దయాగుణం అనేది రోజురోజుకు కనుమరుగైపోతుంది అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు కేవలం పరాయి వ్యక్తుల విషయంలోనే స్వార్థపూరితంగా ఆలోచించేవారు ప్రతి ఒక్కరు.



 పరాయి వాళ్ళు ఎటు పోతే ఏముంది.. మనం హ్యాపీగా ఉన్నామా లేదా అని కాస్త స్వార్థంగా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మనిషిలో మాత్రం మనం అనే మాట నుంచి నేను అనే స్వార్థం నిండిపోయింది. నేను బాగుంటే చాలు ఇక ఎవరు ఎటు పోతే మనకెందుకు అని అనుకుంటున్నాడు. వెరసి ఇక స్వార్థంతో ఏకంగా సొంత వారి ప్రాణాలను కూడా తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తులు అంతస్తుల కోసం కడుపున పుట్టిన పిల్లలే తల్లిదండ్రుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది అని చెప్పాలి.



 అయితే మొన్నటి వరకు కేవలం కొడుకులు మాత్రమే ఇలా ఆస్తులు ఇవ్వలేదని తల్లిదండ్రులను అనాధలుగా వదిలేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ కొడుకులే కాదు కూతుర్లు కూడా తల్లిదండ్రుల విషయంలో ఇదే స్వార్థంతో ఆలోచిస్తారు అనే దానికి నిదర్శనంగా ఇక్కడ ఘటన వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లాలో కూతుళ్లు సైతం తమకు ఆస్తులు ఇవ్వలేదని కన్నతల్లిని ఆసుపత్రిలోనే వదిలేశారు. చివరకు ప్రాణాలు విడిచిన పట్టించుకోలేదు. డబ్బు, ఆస్తులు సరిగా పంచలేదని శవాన్ని కూడా తీసుకెళ్లలేదు కూతుర్లు. కామారెడ్డి జిల్లా కు చెందిన కిష్టవ్వ అనే వృద్ధురాలికి కొడుకులు లేరు.. కూతుర్లు పట్టించుకోలేదు. చివరికి అందరూ ఉన్న అనాధలా మారి చివరికి ప్రాణాలు వదిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: