ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి తప్ప జీవితం పై ఆశ కోల్పోకూడదు అని ఎంతలా అవగాహన కల్పించిన నేటి రోజుల్లో జీవితాలను తృణపాయంగా వదిలేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి.  ఏ చిన్న సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అనే విధంగానే నేటి రోజుల్లో జనాల ఆలోచన తీరు మారిపోయింది. ఈ క్రమంలోనే క్షనికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఎంతోమంది నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం మరో క్షణంలో ప్రాణం పోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించిన రీతిలో దేవుని లాగా వచ్చి సాటి మనుషులు కాపాడటం జరుగుతూ ఉంటుంది.


 ఇలాంటి ఘటనలు చూసినప్పుడు భూమ్మీద నూకలు తినే బాకీ ఉండాలే కానీ ఎలాంటి ప్రమాదం కూడా ప్రాణాలు తీయలేదు అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అతను ఏం కష్టం వచ్చిందో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. రైలు వస్తుండగా పట్టాలపై పడుకున్నాడు. కానీ అతని ప్రాణాలను కాపాడడానికి ఒక మహిళా కానిస్టేబుల్ దేవతల దిగి వచ్చింది. ఎంతో సాహసం చేసి మరి అతని ప్రాణాన్ని కాపాడింది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్లోని పూర్వ మేధీనిపూర్ రైల్వే స్టేషన్లో వెలుగులోకి వచ్చింది. ఇక ట్విట్టర్ వేదికగా ఈ వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. రైలు కింద పడి చనిపోవాలి అనుకున్నాడు ఒక యువకుడు. ఈ క్రమంలోనే రైలు వచ్చేంతవరకు అక్కడ ఫ్లాట్ ఫారం పైనే వేచి చూశాడు. అయితే ఒకవైపు నుంచి వేగంగా రైలు వస్తున్న విషయాన్ని అతను గమనించాడు. వెంటనే ఇక అతను పట్టాలపైకి వెళ్లి అక్కడ తన తలపెట్టి పడుకున్నాడు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ సుమతి ఈ విషయాన్ని గమనించింది. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా శరవేగంగా అతని దగ్గరికి వెళ్లి రైలు వచ్చేలోపే అతని ట్రాక్ పైనుంచి లాగి పడేసింది. ఒక్క సెకండ్ ఆలస్యమైన అతని ప్రాణం పోయేది అని చెప్పాలి. ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో చనిపోవాలనుకున్న సదరు వ్యక్తి దగ్గరికి దేవతల కానిస్టేబుల్ దిగి వచ్చింది అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: