ఎంతో రుచిగా.. అద్భుతంగా ఇంట్లోనే టమోటా కూర చేసుకోండి... కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న కుటుంబీకులు ఎంతో రుచికరమైన కూరను చేసి పెట్టండి.. ఇంట్లో ఉంటాం కాబట్టి బర్గర్.. పిజ్జా వంటివి అన్ని కూడా క్లోజ్ అయ్యాయి. బయట ఆహారం నిషేధం.. కాబట్టి ఇంట్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన కూరను చేసుకొని తినండి. రుచిని ఆస్వాదించండి.

 

కావాల్సిన పదార్ధాలు... 

 

బెండ‌కాయ‌లు - అర‌కిలో,

 

ఆలివ్‌ నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,

 

ఉల్లిపాయ - ఒకటి,

 

వెల్లుల్లి - 8 రెబ్బలు,

 

కొత్తిమీర‌ తురుము - 4 టేబుల్‌స్పూన్లు,

 

టమాటాలు - పావుకిలో,

 

మంచి నీళ్లు - 2 కప్పులు,

 

వెజిటబుల్‌ స్టాక్‌ - 2 టేబుల్‌స్పూన్లు,

 

ధనియాల పొడి - అరటీ స్పూను,

 

దాల్చిన చెక్క పొడి - పావు టీస్పూను, 

 

మిరియాల పొడి - అరటీస్పూను, 

 

ఉప్పు - తగినంత, 

 

పప్పుల నూనె - ముక్కలు వేయించడానికి సరిపడా. 

 

తయారీ విధానం.. 

 

వెల్లుల్లి, టమాటాలు మెత్తని గుజ్జులా చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక ముక్కలుగా కోసి బెండకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టాలి. విడిగా ఓ పాన్ లో ఆలివ్‌ నూనె వేసి ఉల్లి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర తురుము వేసి వేయించాలి. ఇప్పుడు వేయించిన బెండకాయ ముక్కలు, టమోటా గుజ్జు, మంచినీళ్లు, వెజిటబుల్‌ స్టాక్‌ పోసి, ఉప్పు వేసి మరిగించాలి. ఆతరవాత సిమ్‌లో పెట్టి ధనియాల పొడి, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి దగ్గరగా అయ్యే వరకూ ఉడికించి తీసెయ్యాలి. అంతే టమాటా బెండకాయ కర్రీ రెడీ. ఇన్నాళ్లు సిటీలలో ఆ పిచ్చి పిచ్చి బ్రెడ్డు ముక్కలు తిని నోరు పాడు చేసుకున్న వారికీ ఈ కర్రీ పెడితే అద్భుతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: