కావాల్సిన ప‌దార్థాలు:
మష్రూమ్స్- ఒక‌ కప్పు
గోధుమ పిండి- రెండు కప్పులు
ఉల్లిపాయ త‌రుగు- ఒక క‌ప్పు

 

పచ్చి మిర్చి- రెండు 
ఉప్పు- రుచికి స‌రిప‌డా
కారం- ఒక‌ టేబుల్ స్పూన్

 

బంగాళ‌దుంప‌- ఒక‌టి
నూనె- డీ ఫ్రై సరిపడా
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా గోధుమ పిండినిలో కొద్దిగా ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మష్రూమ్స్ ను కూడా ఉడికించుకుని పెట్టుకోవాలి. అలాగే బంగాళ‌దుంప‌ను ఉడికించి.. బాగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాస్త వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసుకోవాలి. 

IHG

వాటిని గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు అందులో ఉడికించిన మష్రూమ్స్ ముక్కలు వేసి కాస్త వేయించాలి. తర్వాత చిదిమిన బంగాళ‌దుంపును మిశ్రమంలో వేసి, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి వేయించాలి. తర్వాత చపాతీ పిండిని చేసుకొని  సమోసాలా చేసి అందులో ఈ మిశ్రమాన్ని ఉంచి అంచుల‌ను నీళ్ల‌తో మూసుకోవాలి.

IHG

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో పాన్ పెట్టుకొని డీ ఫ్రై కి కావలసిన నూనె వేసి వేడయ్యాక ఈ సమోసాలను అందులో వేసి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే వేడి వేడి మష్రూమ్ సమోసా రెడీ అయిన‌ట్లే. ఈ సమోసాలను ఎదైనా చట్నీ‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి. వీటిని పిల్ల‌లు కూడా బాగా ఇష్ట‌ప‌డ‌తారు. కాబ‌ట్టి, ఖ‌చ్చితంగా ఈ లాక్‌డౌన్ టైమ్‌లో మష్రూమ్ సమోసా పైన చెప్పిన విధంగా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: