తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కొద్ది నీళ్లు పోసి అరటి పండును ఓ పదినిమిషాలు బాగా ఉడికించాలి. అది ఉడుకుతున్నప్పుడు బుడగలు వస్తాయి, వాటిని తీసేసి ఆ నీటిని తాగుతారు. ఈ నీటిలో ఏమీ కలపాల్సిన అవసరం లేదు.ఈ నీళ్లు చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చితే అరటి తొక్కతోపాటు ఉడికించుకోవచ్చు. తొక్కే కదా అని తీసేయకండి. ఇందులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది.మలబద్దకం సమస్య ఉన్నవారికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆహారం వెంటనే రక్తంలో కలిసిపోకుండా చేస్తుంది. అందుకే డయాబెటీస్ ఉన్న వారు తప్పక తీసుకోవాలి. మీకు నచ్చిన విధాంగా ఇందులో దాల్చినచెక్క, తేనే కూడా కలుపుకొని తయారు చేసుకోవచ్చు. ఈ టీని రాత్రివేళ తాగితే నిద్ర లేమి సమస్య ఉండదు. ఈ టీలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్తయి. అవి మీ గుండెకు, మెదడుకు మేలు చేస్తుంది. బనానా టీ ని ఫ్రిజ్‌లో కూడా రెండు రోజుల పాటు నిల్వ పెట్టుకుని తాగవచ్చు. మరి మీరు కూడా ఒకసారి బననా టీ ను ట్రై చేసి చూడండి. !
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి