పప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పప్పులో ప్రోటీన్స్, కార్బోహైడ్రాట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కనీసం వారానికి రెండు సార్లు అయినగాని పప్పు తింటే ఆరోగ్యానికి మంచిది. అయితే మీకు ఉసిరికాయ పప్పు గురించి తెలిసి ఉండదు. అందుకే ఇండియా హెరాల్డ్ వారు చెప్పే ఉసిరికాయ పప్పును ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో పుల్ల పుల్లగా రుచికరంగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు

కందిపప్పు - ఒక కప్పు,

టమాటాలు - 4,

ఉల్లిగడ్డ - 1,

ఉసిరికాయలు - 10,

కారం - ఒక టీ స్పూన్,

పసుపు - కొద్దిగా

శనగపప్పు - ఒక టీ స్పూన్ ,

మినపప్పు - ఒక టీ స్పూన్,

ఆవాలు - అర టీ స్పూన్,

జీలకర్ర - అర టీ స్పూన్,

వెల్లుల్లిపాయలు - 3,

ఎండు మిరపకాయలు - 2,

కరివేపాకు - 2 రెమ్మలు,

ఉప్పు, నూనె - తగినంత

తయారు చేయు విధానం

ముందుగా కందిపప్పును కడికి ఒక పావుగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొండి.అలాగే  టమాటాలను కూడా కడిగి  చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటితో పాటు ఉల్లిపాయలను, పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును  కుక్కర్‌లో వేసి అందులో ఉసిరికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. చింతపండు పెట్టకూడదు. ఎందుకంటే ఉసిరికాయ పుల్లగా ఉండడం వలన చింతపండు పెట్టక్కర్లేదు. ఇప్పుడు కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి.తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు అయ్యాక మూత తీసి కాస్త ఉప్పువేసి బాగా మెదపాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు,కరివేపాకు,ఎండు మిరపకాయలు వేసి తాలింపు పెట్టి పప్పులో వేసి కలపాలి. అంతే ఉసిరికాయ పప్పు రెడీ అయినట్లే. !


మరింత సమాచారం తెలుసుకోండి: