అమ్మ ఆకలేస్తుంది! మ్యాగీ  చేసి పెట్టావా,,,హే డ్యూడ్ లెట్స్ ఆర్డర్ సం పిజ్జా....రేయ్ చింటూ పానీ పూరి తినొద్దామా...అంటూ 10 లో 8 మంది  స్నాక్స్ టైంలో స్నాక్స్ కోసం  ప్రస్తుతం చేసే పని ఇదే. అదే ఒక్కపుడు మన అమ్మ, అమ్మమ, నాన్నమ్మల కాలంలో వాళ్ళకి ప్రతిరోజు ఒక  కొత్త, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన   ఫలహారాలు చేసిపెట్టేవారు .ఆ! ఇప్పుడు మన బిజీ లైఫ్ లో అంత టైం ఎక్కడిది? పండగలకి చేసేసరికి నడుములు ఆమ్మో అంటున్నాయి.... అందుకే ఇలా ఈజీ టు మేక్ లేదా ఈజీ టు గెట్ దానికి అలవాటు అవుతున్నాము. మన ఈ బిజీ లైఫ్ లో బిజీ బిజీగా ఉంటూ కూడా కొన్ని రుచికరం మరియు ఆరోగ్యకరమైన ఫలహారాలను మనం చేసుకోవచ్చు... అందులో ఒకటి "మస్తీ కోకోనట్ బాల్స్".  
 
మరి దానికి కావాల్సిన పదార్థాలు మరియు చేసే విధానం ఇదిగోండి....
 
కావలసిన పదార్థాలు:
పచ్చి కొబ్బరి తురుము - 3 కప్పులు
శనగపిండి(బేసన్) - 2 టేబుల్ స్పూన్లు
వరి పిండి (బియ్యం పిండి) - 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
గరంమసాలా  - 1/2  టేబుల్ స్పూన్
కారం పొడి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
నువ్వులు - 1/4 టేబుల్ స్పూన్
పసుపు - చిటికెడు
నూనె - డీప్  ఫ్రైకి సరిపడా
 
 
తయారు చేసే విధానం:
 ఒక గిన్నెలో   3 కప్పుల పచ్చి కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి,  2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 1  టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2  టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/4 టేబుల్ స్పూన్ నువ్వులు,చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి  అన్ని కలిసేట్టుగా కలుపుకోవాలి. (గమనిక:ఒక చుక్క నీరు  కూడా వాడకూడదు, కొబ్బరిలో ఉన్న తడి సరిపోతుంది)  అలా కలుపుకున్న ముద్దని 2 నిమిషాలపాటు పక్కకి పెట్టి దాన్ని ఒక మూతతో  కవర్ చేయాలి.  ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడికి పెట్టుకోవాలి. కొబ్బరి ముద్దను  చిన్న చిన్న బాల్స్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని వేడి వేడిగా  పెరుగు లేదా టమాటో సాస్‌తో సర్వ్ చేయొచ్చు.
ఈ మస్తీ బాల్స్ మనకి రెండు రోజుల పాటు నిల్వ ఉంటాయి.
మరి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, మస్తీకి మస్తీ అయిన మస్తీ కోకోనట్ బాల్స్ మీరు ఎప్పుడు చేయబోతున్నారు?

మరింత సమాచారం తెలుసుకోండి: