ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో నిన్న మధ్యాహ్నం భార్యకు తెలియకుండా తన గర్ల్ ఫ్రెండ్‌కు దుస్తులు కొనిపెట్టిన ఓ ప్రబుద్ధుడిని అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. బహిరంగంగా అతడిని నిలదీస్తూ అందరిముందూ ఉతికిపారేసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. విపరీతంగా ట్రెండ్ అవుతుంది. నెటిజన్ల కామెంట్ల తో ఒక్క రోజులోనే విపరీతంగా ఆకట్టుకుంది.. మహిళ చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.