కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో మైనారిటీ వర్గానికి చెందిన బాలిక తల్లితో కలిసి నివాసముండేది. అయితే.. ఇటీవలే ఆ బాలిక తల్లి మృతి చెందడంతో ఆమె బాగోగులు చూసుకునే వారే కరువయ్యారు. తల్లిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఆ బాలికను వెతుక్కుంటూ మేనమామ వరుసయ్యే ఆసీఫ్ ఆమె ఇంటికొచ్చాడు. ఆసీఫ్ కామారెడ్డికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కావడం గమనార్హం.ఆమెకు తనంటే నమ్మకం కలిగేలా కొన్నిరోజులు ప్రవర్తించిన ఆసిఫ్ రానురాను తన వక్రబుద్ధి బయటపెట్టసాగాడు.ఆ నేపథ్యంలో బాలికను ఒక సీక్రెట్ ప్లేసు కు తీసుకెళ్ళాడు. అక్కడ ఆమె పై అత్యాచారం చేశాడు..