ప్రియుడి ఆచూకీ తెలపాలంటూ ఓ ప్రియురాలు వాటర్‌ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల పరిధిలోని మల్లాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా వేంసూర్ మండలానికి చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తుంది. స్నేహితులు ద్వారా మల్లాపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. శారీరకగా దోచుకొని ఇప్పుడు పెళ్లి పేరు వినగానే పారిపోయాడని వాపోయింది.