అయితే బీహార్ లో ఇప్పటికే మద్యం నిషేధం విధించారు అధికారులు. అయినా అక్రమంగా ఇంకా కొందరు కేటుగాళ్లు కల్తీ మద్యాన్ని అమ్ముతూ.. ఎంతో మంది ప్రాణాలను పొట్టొన బెట్టుకుంటున్నారు. కేవలం కల్తీ మద్యం మూలంగానే ఈ ఐదుగురు ప్రాణాలు విడివడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన జిల్లాలోని కట్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దర్గా గ్రామంలో జరిగింది. కాగా ఈ కల్తీ సార దందా వెనక ఓ చోటా నాయకుడి హస్తం ఉందని కొందరు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం వారు తయారు చేసిన నాటు సారా మూలంగానే అమాయకులైన ఐదుగురి మృతికి కారణమయ్యారని వారు విమర్శిస్తున్నారు.ఇక పోతే ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టులో వీరి మరణానికి కారణం సారానా.. లేక మరోటా.. అనేది తేలుతుందని పోలీసులు అంటున్నారు. ఈ ఒక్క చోటే కాదు.. దేశంలోని ఏదో ఒక ప్లేస్ లో ఇలాంటి కల్తీ జరుగుతూనే ఉంది. దీని భారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఈ దారుణాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ మధ్యనే కల్తీ కల్లు, మద్యం మూలంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చి.. అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి