ఎక్కడ చూసినా దొంగల బెడద ఎక్కువ అయిపోతుంది. ఇంటికి తాళం కనిపించింది అంటే చాలు ఇక ఏదో ఒక విధంగా ఇంట్లోకి చొరబడి ఇంటిని గుల్ల  చేస్తున్నారు దోపిడి దొంగలు. ఇక అందినకాడికి దోచుకు పోతూ ఇంటి యజమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారు. అయితే సాధారణంగా ఇంటి యజమానులు ఎక్కడికైనా బయటకి వెళ్ళే సమయంలో ఇంట్లో దొంగతనం జరగ్గా కుండా చూసుకోవాలి అంటూ దేవుడికి మొక్కు వెళుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  కానీ ఇటీవలి కాలంలో ఏకంగా దేవుడి గుళ్ళో దొంగతనాలు జరుగుతూ ఉండడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోతుంది. దొంగల బారి నుంచి దేవుళ్ళకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని భయపడి పోతున్నారు జనాలు.


 అయితే ఇటీవలి కాలంలో దొంగలు ఎక్కువగా ఆలయాలనే టార్గెట్ గా చేసుకుంటున్నారు. వివిధ ఆలయాలను టార్గెట్ గా చేసుకుని బంగారు ఆభరణాలను నగదును ఎత్తుకెళ్లటం లాంటి ఘటనలు కూడా ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి గుడిలో దొంగతనాలకు పాల్పడేందుకు కూడా ఎక్కడా భయపడటం లేదు. అయితే సాధారణంగా ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని సవ్యంగా జరగాలని ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంటారు అందరూ. ఇక్కడ ఓ దొంగ కూడా ఇలాంటి ఆనవాయితీ పాటించి షాకిచ్చాడు. అమ్మవారి గుడి లోనే దొంగతనానికి వెళ్లి ఏకంగా పని సవ్యంగా జరగాలని అమ్మవారిని మొక్కుకున్నాడు.



 ఖమ్మం జిల్లా కేంద్రంలోని నాల్గవ డివిజన్ అంకమ్మ ఆలయం లో ఈ ఘటన జరిగింది. అక్టోబర్ 31వ తేదీన అర్ధరాత్రి సమయంలో ప్రధాన ద్వారం తాళం  పగలగొట్టిన దొంగ నగదును దొంగలించాడు. అయితే ఇలా చోరీ చేయడానికి వచ్చిన సమయంలో చోరీ ప్రారంభించడానికి ముందు ఏకంగా అక్కడ ఉన్న అమ్మవారికి నమస్కరించాడు. పని మొత్తం సవ్యంగా జరగాలి అంటూ కోరుకున్నాడు. ఇక ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. అయితే తర్వాత రోజు ఇక దేవస్థానం కమిటీ అధ్యక్షుడు భాస్కర్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: