హైద‌రాబాద్ న‌గ‌రంలోని స‌రూర్‌న‌గ‌ర్ మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర బీసీ గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్ కావ‌డంతో శుక్ర‌వారం రాత్రి 16 మంది విద్యార్థులు అస్వ‌స్థత‌కు గుర‌య్యారు. ముఖ్యంగా మంచినీరు, ఫుడ్ పాయిజ‌న్  కావ‌డంతోనే విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు తెలుస్తోంది. విద్యార్థులు అస్వ‌స్త‌త‌కు గురైన‌ప్పుడే తొలుత ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా... అక్క‌డి నుంచి నీలోఫ‌ర్ ఆసుప‌త్రికి త‌రలించారు. 108 వాహ‌నంలో నిలోఫ‌ర్‌కు త‌ర‌లించిన విద్యార్థుల‌ను మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా నాలుగు రోజుల నుంచి తాగ‌డానికి మంచినీరు లేక ఇబ్బంది ఎదుర్కున్నాం అని చెప్పడం గ‌మ‌నార్హం.

హాస్ట‌ల్‌లో నీరు లేద‌ని వార్డెన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప‌ట్టించుకోలేద‌ని విద్యార్థులు త‌మ గోడును వెల్ల‌బోసుకున్నారు. అయితే  సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ గురుకుల పాఠ‌శాలలో కలుషిత నీటి వల్ల అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని  మహాత్మ జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల సెక్రటరీ మల్లయ్య బట్టు  మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని.. నీలోఫ‌ర్ ఆసుప‌త్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్న‌ట్టు వివ‌రించారు. పిల్ల‌లంద‌రి ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని, ఇవాళ సాయంత్రం వ‌ర‌కు డిశ్చార్జ్ అవ్వ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. రేప‌టి నుంచి య‌ధావిధిగా విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు వెళ్తార‌ని మ‌ల్ల‌య్య‌బ‌ట్టు తెలిపారు.

మ‌రోవైపు ఇవాళ స‌రూర్ న‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఆకుల శ్రీ‌వాణిఅంజన్ నీలోఫ‌ర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల‌ను ప‌రామ‌ర్శించారు. విద్యార్థులు తాగిన వాట‌ర్‌లో పెట్రోల్ క‌లుషితం అయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి అది నిజ‌మేనా అని కార్పొరేట‌ర్ విద్యార్థుల‌ను ప్ర‌శ్నించ‌గా విద్యార్థులు నిజ‌మేన‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. నాలుగు రోజుల నుంచి వాట‌ర్ రాక‌పోవ‌డంతో స్నానాలు చేయ‌డానికి ఇబ్బంది ప‌డ్డామ‌ని, వాట‌ర్ తాగ‌డానికి లేద‌ని, వాడుకోవ‌డానికి లేవ‌ని వార్డెన్ దృష్టికి తీసుకు వెళ్లినా ప‌ట్టించుకోలేద‌ని ఓ డ్ర‌మ్ములో ఉన్న నీరు తాగామ‌ని.. అవి తాగిన గంట‌లోపు వాంతులు, విరేచ‌నాలు అయి ఆసుప‌త్రి పాల‌య్యామ‌ని వెల్ల‌డించారు విద్యార్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి: