అనుమానం పెను భూతం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిండి లేకపోయిన  బ్రతకవచ్చు.. పచ్చని సంసారం లో అనుమానం అనేది ఒకసారి వస్తే కూలిపోతుంది. ఇలాంటి సంసారాలు ఎన్నో అనుమానం వల్ల చెల్లాచెదురుగా అయ్యాయి. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. భార్య మీద అనుమానంతో భర్త అతి దారుణంగా కొట్టి కరెంట్ వైరు చుట్టి అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య పై రోజు రోజుకు అనుమానం పెంచుకున్న భర్త ఆమె ఎలాగైనా చంపెయాలని అనుకున్నాడు.


వివరాల్లొకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.ప్రకాశం జిల్లా దర్శి లో ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. విషయాన్నికొస్తే.. పొదిలి మండలంలోని సూదనగుంట రామాపురం గ్రామానికి చెందిన  రమణారెడ్డికి అనే వ్యక్తికి కెజియా తో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక కుమారుడు రేవంత్‌ ఉన్నాడు. రమణారెడ్డి సినిమా థియేటర్ ను లీజుకు తీసుకుని నడిపిస్తూ వస్తున్నారు.. కొద్ది రోజులు బాగానే సాగిన వీరి సంసారం లో అనుమానం ఎంటర్ అయ్యింది. రమణారెడ్డికి తన భార్య కెజియాపై అనుమానం ఏర్పడింది. తరచూ ఆమెను దూషిస్తూ కొట్టేవాడు.


రోజూ వీళ్లకు గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు చేరింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి.. రమణారెడ్డి తన భార్య, కుమారిడిని తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. కుమారుడి గొంతు నులిమి చంపేందుకు ట్రై చేశాడు. ఇద్దరి శరీరాలకు తీగలు చుట్టి విద్యుదాఘాతం ద్వారా చంపెందుకు యత్నించాడు. ఈ ఘటనలో రేవంత్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విని.. నిద్ర లేచిన ఇంటి యజమాని అక్కడికి చేరుకోవడంతో రమణారెడ్డి అక్కడ నుంచి పారిపోయాడు.. బాధితులను దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: