ఏం చేస్తాం దురదృష్టం కొద్దీ అలాంటి వివరాలు కూడా యూట్యూబ్ లో దొరుకుతున్నాయి. మరి ఇలా యూట్యూబ్ లో చూసి నేర్చుకుని నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య నేటి రోజుల్లో పెరిగిపోతూనే ఉంది. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని బి హెచ్ సి ఎల్ పోస్ట్ ఆఫీస్ చోరీ కూడా ఈ కోవలోకే వస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో స్వీపర్ గా పనిచేస్తూ ఉంటాడు తెల్లాపూర్ కు చెందిన ఎండి జహీర్. ఇక ఇటీవల పోస్టాఫీసులో చోరీ జరగగా తమదైన శైలిలో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని దగ్గర నుంచి ముప్పై మూడు లక్షలు నగదు చోరీ ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే పోలీస్ విచారణలో బయట పడినా షాకింగ్ విషయాలను ప్రెస్ మీట్ పెట్టి వివరించారు పోలీసులు. పోస్టాఫీసులో చోరీ జరిగిన నాటి నుంచి అక్కడ పనిచేసే జహీర్ విధులకు హాజరుకాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన అదుపులోకి తీసుకొని విచారించగా ఇక నేరం అంగీకరించాడు జహీర్. దొంగతనం చేసిన వాటిలో లక్షలకు పైగానే ఖర్చు చేశాడు. మిగతా డబ్బులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జహీర్ యూట్యూబ్ లో వీడియోలు చూసి చోరీ చేయడం ఎలా అనితెలుసుకొని మరీ ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడ్డాడు అన్న విషయం విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి