
దేశ రాజధాని ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.ఇంట్లో పనిమనిషిగా ఉన్న వ్యక్తి ఏకంగా యజమాని 13 ఏళ్ల కుమార్తె 11 ఏళ్ల మేనకోడలు నగ్న చిత్రాలు వీడియోలను ఫోన్లో చిత్రీకరించాడు. ఇక ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.. కాస్త వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఎనిమిదేళ్లుగా దక్షిణ ముంబైలో ఉన్న ఒక గిఫ్ట్ షాపు యజమాని ఇంట్లో పని మనిషి గా పని చేస్తున్నాడు. అయితే యజమాని ఇంట్లో లేని సమయంలో మైనర్ బాలికలు బట్టలు మార్చుకునేటప్పుడు ఫోటోలు వీడియోలు తీసేవాడు.
అయితే ఇటీవలే యజమాని కూతురు నిందితుడి మొబైల్ ఫోన్ లో గేమ్ ఆడుతున్న సమయం లో ఇక ఆమె బట్టలు మార్చుకునేటప్పుడు పని మనిషి తీసిన ఫోటోలు కనిపించాయి. దీంతో ఈ విషయం బాలిక తండ్రికి చెప్పింది. దీంతో ఇక నిందితులు ఫోన్లో పదకొండేళ్ల బంధువు తన కూతురు నగ్న ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయని గమనించిన యజమాని పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమం లోనే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం సదరు పని మనిషిని అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు..