ప్రేమను పంచి అల్లారు ముద్దుగా పెంచిన తల్లి దండ్రుల విషయం లో కాస్తయినా మానవత్వాన్ని చూపించ లేకపోతున్నారు వారి కడుపున పుట్టిన పిల్లలు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా వృద్ధుడైన తండ్రి విషయం లో మానవత్వాన్ని మరిచి పోయిన కొడుకు దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తండ్రి మృత దేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి నిప్పంటించి తగలబెట్టాడు. ఉత్తర ప్రదేశ్లోని మధురలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నర హోలీ గ్రామానికి చెందిన ఆమె తన తండ్రిని ఇలా హత్య చేశాడు.
అమృతలాల్ అనే వ్యక్తి ప్రస్తుతం వృద్ధాప్యం నేపథ్యం లో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇకపోతే ఇటీవలే అమృతలాల్ భార్య ఆశాదేవి ఇటీవల తండ్రి కొడుకులను ఇంట్లో వదిలి పెట్టింది. ఇక తండ్రి తో ఒంటరిగా ఉన్న వినీత్ ఇళ్ళు విక్రయించాలని తండ్రి పై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. కానీ అతడు మాత్రం ఒప్పుకోలేదు. ఇదే విషయం లో కోపం తో ఊగి పోయాడు కొడుకు వినీత్. ఇక దారుణం గా తండ్రి గొంతు కోసి దుప్పటితో చుట్టి మృతదేహాన్ని కాల్చివేశాడు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా అసలు నిందితుడు కొడుకు అన్న విషయం తేలింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి