ప్రభుత్వాలు మారుతున్నాయి.. వచ్చిన ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఎక్కువగా కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. అలా కొత్తగా ఎన్ని చేసిన మహిళల రక్షణ కోసం మాత్రం ఆ చట్టాలు పెద్దగా ఉపయోగపడలేదు. దేశం లో ఎక్కడో చోట మహిళల పై చిన్నారుల పై లైంగిక దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. అమ్మాయిలు ఎప్పుడూ ఎం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోతూన్నారు. రాను రాను కామాంధుల రాజ్యం అవుతుందని అర్థం అవుతుంది.


నార్త్‌ ఇండియాలో ఎక్కువగా మహిళల పై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. రాజస్థాన్, పంజాబ్, మధ్య ప్రదేశ్ లో లైంగిక వేధింపులకు ఎక్కువ మంది గురవుతున్నారు.. ముఖ్యంగా రాజస్థాన్ లో ఎక్కువగా జరుగుతున్నాయి.. ఓ బాలిక పై ముగ్గురూ అన్న దమ్ములు కలిసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లొకి వెళితే.. రాజస్థాన్ బార్మర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. మైనర్ పై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది..


ఓ బాలికపై కన్నేసిన ఓ పోస్ట్‌ మాస్టర్‌ ఆమెను మాయ మాటలతో నమ్మించి ఫంక్షన్‌ ఉందంటూ ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేశాడు.ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.. ఆ తర్వాత తనను తన తమ్ముడుకు బాలికను అప్పగించాడు.అతను ఇంటి దగ్గర వదిలి పెడతాడు అనుకుంటే జోధ్‌ పూర్‌ లోని ఓ ఇంట్లో బంధించి.. నెలన్న రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు.ఆ తర్వాత మరో ఇద్దరు తమ్ములు కలిసి ఆమెను లైంగిక దాడి చేశారు.ఇలా అందరూ కలిసి బాలికకు రెండు నెలలు నరకాన్ని చూపించారు.. ఎలాగో తప్పించుకుని బయటకు వచ్చిన అమ్మాయి విషయాన్ని తన అన్నకి చెప్పింది. పోలీసులకు ఫిర్యాధు చేయడం తో అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: