ప్రేమ అంటే ఒక మధురమైన జ్ఞాపకం. ఎప్పుడూ ఎవరి మధ్య ఏ క్షణంలో ప్రేమ పుడుతుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. అయితే  సాధారణంగా యువతీ యువకుల మధ్య ప్రేమ పుడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇది ప్రకృతి ధర్మం కూడా. యువతీ యువకుల మధ్య పుట్టిన ప్రేమ చివరికి పెళ్లి వరకు వెళ్లి ఆ తర్వాత పిల్లాపాపలతో సంతోషంగా ఉండే వరకు కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం యువతీయువకుల మధ్య కాదు ఏకంగా ఇద్దరు యువకుల మధ్య ప్రేమ పుట్టడం అందరికీ చిరాకు పుట్టిస్తుంది. అంతే కాదు కొంత మంది యువతులు కూడా మరో యువతిని ప్రేమించి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు.


 ఇలా ప్రకృతి విరుద్ధంగా ప్రేమించడమే కాదు ప్రేమను గెలిపించుకుంటాం  అంటు సినిమా లో డైలాగులు చెప్పేస్తూ ఉన్నారు. ఈ సభ్య సమాజం మా ప్రేమను అంగీకరించకపోయినా సమాజాన్ని ఎదిరించి మేము ఒక్కటవుతాము అంటూ ఛాలెంజ్ కూడా చేస్తున్న ఘటనలు చూస్తూ ఉన్నాం. ఇలా ఇటీవలి కాలంలో ఏకంగా ఇద్దరు యువకుల మధ్య లేదా ఇద్దరు యువకుల మధ్య పుడుతున్న ప్రేమ అందరినీ అయోమయంలో పడేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 ఒకే కాలేజీలో చదువుకునే ఇద్దరు యువతుల మధ్య ప్రేమ చిగురించింది. కర్ణాటకలోని తుముకూరు లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలోనే ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాలి అనుకున్నారు ఇద్దరు యువతులు. కానీ పెద్దలు మాత్రం ఒప్పుకోలేదు. పోలీసులను ఆశ్రయించిన వారు కూడా పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సభ్య సమాజాన్ని ఎదిరించి ప్రేమను గెలిపించుకోవడానికి గ్రామం వదిలి వెళ్ళిపోయారు. ఇక తర్వాత కొన్ని రోజులకు ఈ గ్రామానికి వచ్చారు. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు పోలీసుల సహాయంతో ఇద్దరు యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి మనసు మార్చి ఇక ఇంటికి తీసుకెళ్లారు. దీంతో ఈ యువతుల ప్రేమ కథ సుఖాంతం అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: