ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. అతను ఒక యాజకుడు దానం చేయండి మహా ప్రభు అంటూ ప్రతి రోజు కనిపించిన వారి దగ్గర చేయి చేస్తూ భిక్షాటన చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అలాంటి యాచకుడు దగ్గర బయటపడిన డబ్బు గురించి తెలిసి అటు పోలీసులు సైతం షాప్ లో మునిగిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏపీ లోని కాకినాడ జిల్లాలో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యాచకుడు హఠాత్ మరణం చెందిన తర్వాత అతని దగ్గర ఏకంగా సంచుల నిండా డబ్బులు బయటపడ్డాయి. ఇది చూసి స్థానికులు అందరూ నివ్వెర పోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు
కరప మండలం వేలంగి లో భిక్షాటన చేస్తూ ఉంటాడు రామకృష్ణ అనే వృద్ధుడు. ఇకపోతే ఇటీవలే గుండెపోటుతో చనిపోయాడు. ఈ క్రమంలోనే అక్కడి స్థానిక అధికారులు అతని అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే మార్కెట్ దగ్గర సదరు యాచకుడు నివసించే ఒక గదిలో రెండు సంచులు లభించడం గమనార్హం. ఇక ఆ సంచుల నిండా నోట్లకట్టలు చిల్లర నాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. రెవెన్యూ పోలీసుల సమక్షంలో డబ్బులు లెక్కించగా మొత్తం రెండు లక్షల వరకు ఉన్నట్లు తేలింది ఇక ఈ డబ్బును పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి