ఇటీవలి కాలంలో మారుతున్న మనిషి జీవన శైలిలో బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే కట్టుకున్న బంధాలు కన్న బంధాలు కర్కశంగా మారిపోతూ ఉన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.  కాగా సొంత వారి ప్రాణాలను కూడా గాల్లో కలిపేసెందుకు ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా కంటికి రెప్పలా కాచుకోవాల్సిన కన్నవాళ్లే నేటి రోజుల్లో పిల్లలను దారుణంగా హతమారుస్తున్న ఘటన లు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలా క్షణికావేశంలో మనుషులు ప్రవర్తిస్తున్న తీరు అనుబంధాలను ఛిద్రం చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా బెట్టింగ్ విషయాలను ఎక్కడ బయట పడతాడో అని భయపడి పోయిన తండ్రి రక్తం పంచుకుని పుట్టిన కుమారుడు పై ఉన్న ప్రేమను మరచి పోయాడు. కిరాతకుడిగా మారిపోయి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కోలారు తాలూకా లో వెలుగులోకి వచ్చింది. చిక్కబల్లపుర జిల్లా చింతామణి తాలూకు మధుర కళ్ళు కు చెందిన నిఖిల్ కుమార్ అనే పన్నెండేళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు సూత్రధారి పాత్రధారి నిఖిల్ కుమార్ తండ్రి మణికంఠప్ప అనే విషయాన్ని తేల్చారు.


 ఇటీవలే ఐపీఎల్ జరిగిన సమయంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ డబ్బులు పోగొట్టుకున్నాడు మణికంఠప్ప. ఇటీవలే ఈ విషయం కుమారుడికి తెలిసింది. కొడుకు ఈ విషయాలను బయటకు చెబితే ఏం జరుగుతుందో అని భయపడి పోయాడు మణికంఠప్ప. ఈ క్రమంలోనే కుమారుని గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. సమీపంలో ఉన్న చెరువులో కుమారుడు మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఇక చెరువులో బాలుడు మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు తండ్రిపై అనుమానం వ్యక్తం చేసి విచారణ జరపగా ఇక అసలు హంతకుడి తండ్రి అన్న విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: