నేటి రోజుల్లో ఎక్కడ చూసినా సమాజంలో రక్తపాతం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు . వివిధ కారణాలతో ఎంతోమంది సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి ఎక్కడా వెనకాడటం లేదు.  ప్రాణాలు తీస్తే శిక్షలు పడతాయని ఇక చిప్పకూడు తినాల్సి వస్తుంది అని ఎవరూ ఆలోచించడం లేదు. అరటిపండు ఒలిచి కు తిన్నంత ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కలీపేస్తున్నారు ఎంతోమంది. ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులను వెలుగులోకి వస్తున్న ఘటనలను చూస్తూ ఉంటే ఇక ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. ఈ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరూ వచ్చి ప్రాణాలు తీస్తారో అని అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి నేటి ఆధునిక సమాజంలో ఏర్పడింది.


 ముఖ్యంగా అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇస్తూ ఎంతో గౌరవంగా బతకడం కంటే క్షణకాల సుఖం కోసం పరాయి వ్యక్తులతో మోజులో పడి నీచమైన పనులు చేయడానికి కూడా వెనకాడటం లేదు.వెరసి ఇక మానవ బంధాలకు అసలు విలువ లేకుండా పోతుంది. ఇలాంటి అక్రమ సంబంధాలు నేపథ్యంతోనే హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న 35 ఏళ్ల మహిళతో 45 ఏళ్ల వ్యక్తి  సహజీవనం చేస్తూ వస్తున్నాడు.


 ఇక ఈ బంధాన్ని అస్సలు జీర్ణించుకో లేక పోయినా సదరు మహిళ తండ్రి చివరికి సహజీవనం పెట్టుకున్న వ్యక్తిని దారుణంగా హత మార్చేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన చంద్రయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ లో వెలుగులోకి వచ్చింది. అలా 62 ఏళ్ళ వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే చిన్న కుమార్తెకు భర్త పిల్లలు చనిపోవడంతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. కార్మికురాలు గా పనిచేస్తుంది. అయితే తోటి కార్మికుడు  షేక్ ఇస్మాయిల్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇటీవలే ఇస్మాయిల్ కు సదరు మహిళకు మధ్య ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో గొడవ జరిగింది.  ఇది గమనించిన ఆమె తండ్రి ఎందుకు గొడవ పడుతున్నావ్  అంటూ ఇస్మాయిల్  ను నిలదీయగా.. ఇక మాటా మాటా పెరగడంతో బండరాయితో కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. ఇక ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: