ఇటీవలికాలంలో మద్యానికి బానిసలు గా మారిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. మద్యానికి బానిస గా మారిపోయి కుటుంబ బాధ్యతలను గాలికొదిలేసి చివరికి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. మరికొంతమంది చివరికి మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోతూ కుటుంబంలో విషాదం నింపుతూ ఉన్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కల్తీ మద్యం రాజ్యమేలుతున్న సమయంలో ఎంతోమంది మద్యం తాగి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక ఇటీవల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 కల్తీ మద్యం తాగి ఏకంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన గుజరాత్లోని బోటాడు జిల్లా రోజిడ్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. మరో పదిమందికి తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం కోన ప్రాణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాటుసారా తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు కటకటాల వెనక్కి తోశారు. రోజిడ్ గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంతమంది అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారిపోయింది.


 చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మధ్యాహ్నం సమయంలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇప్పటి వరకు ఇలా కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10 కి చేరింది అన్నది తెలుస్తుంది. అయితే ఇటీవలే రాత్రి రోజిడ్ గ్రామంలో నాటుసారా తాగిన తర్వాత తన భర్త అనారోగ్యానికి గురైనట్లు ఓ మృతుడి భార్య పోలీసులతో తెలిపింది. ఇక ఈ ఘటన కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే డిప్యూటీ ఎస్పి అధికారి నేతృత్వంలో ఇక ప్రత్యేక బృందం ఏర్పడి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: