ఇటీవలి కాలంలో ప్రేమ అనేది మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రేమ పేరుతో వల వేయడం ఆ తర్వాత శారీరక అవసరాలు తీర్చుకోవడం నడిరోడ్డు మీద వదిలేయడం లాంటివి చేస్తున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిండా ముంచుతున్న ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది యువతులు కేటుగాళ్ల వలలో పడుతూ రోడ్డుపాలు అవుతున్నారు. ఈ క్రమంలోనే న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక మరోవైపు ప్రియుడి ఇంటి ముందు ధర్నా కూడా చేస్తున్నారు ఎంతోమంది.


 ఇక్కడ ఓ యువతి ప్రేమించిన ప్రియుడుని నమ్మి పెళ్ళికి సిద్ధం అయ్యింది. కానీ పెళ్లి తర్వాత మాత్రం అసలు స్వరూపాన్ని బయట పెట్టి టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు ప్రేమించిన వాడు. దీంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కరీంనగర్లో వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం  జిల్లాకు చెందిన దుర్గా రెడ్డి అనే యువతి హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కరీంనగర్కు చెందిన ఫారుక్ అలీ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే అతను అప్పటికే పెళ్లయిన అంకుల్.  ఈ విషయం దుర్గారెడ్డి కి తెలియదు. కాగా నీ ప్రేమ లేకపోతే చచ్చిపోతాను అంటూ ఆమెను నమ్మించి ముగ్గులోకి దింపాడు ఫారుక్.


 నీ కోసం మతం మార్చుకుని  పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ఆమె గుడ్డిగా నమ్మేసింది. ఇంట్లో సంబంధాలు చూస్తుంటే వద్దు అని చెప్పి.. ఇంట్లో బంగారు నగలు తీసుకుని ప్రియుడుతో వెళ్లి పెళ్లి చేసుకుంది.  గతం లోనే అతనికి పెళ్లి జరగగా.. ఈ వివాహ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. ఇక ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన దుర్గారెడ్డి భర్తను నిలదీసింది.  ఈ క్రమంలోనే  మొదటి భార్యతో సహా నువ్వు నేను అందరం కలిసి ఉందాం అంటూ ప్లేటు ఫిరాయించేశాడు. ఇక అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది దుర్గా రెడ్డి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: