సాధారణంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మృత్యువు ఎప్పుడు ఏ విధంగా దూసుకు వచ్చి ప్రాణాలు తీస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు అనుకోని ఘటనల కారణంగా చివరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. తద్వారా ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఊహించని ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే ఇంకొంతమంది మాత్రం చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా చేసిన పనుల కారణంగా చివరికి అర్ధాంతరంగా ప్రాణాలను పోగొట్టుకుంటున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.

 అలా చేయడం ప్రమాదమని ఏమైనా కాస్త అటు ఇటు అయినా కూడా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా ఎంతోమంది చివరికి ధారణంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలీ. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో కొంత మంది విద్యార్థులు తెలిసి తెలియని వయసులో ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఏడవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య ఎలా చేసుకుంటారూ అని తన తోటి స్నేహితులకు చూపించడానికి ప్రయత్నించి చివరికి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.


  తల్లిదండ్రులకు కూడా తీరని కడుపుకోతను మిగిల్చాడు అని  చెప్పాలి. చెన్నై లోని బుద్ధగరం గ్రామం కామర జల్ నగర్ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  కార్తీక్ అనే బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల ఉరి వేసుకుని ఎలా ఆత్మహత్య చేసుకుంటారో అని తన స్నేహితులకు సోదరులకు చూపించేందుకు ప్రయత్నించాడు కార్తీక్. కుర్చీ మీద నిలబడి ఫ్యాన్ కు తాడు కట్టుకుని ఆ తాడుని మెడకు బిగించుకున్నాడు. ఇలాగే ఉరివేసుకొని చనిపోతాడు అని స్నేహితులకు వివరిస్తున్న సమయంలో అతను నిలబడి  ఉన్న కుర్చీ ఒక్కసారిగా మంచం కిందకి పడిపోయింది. దీంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: